స్థల పురాణం

స్వామివారు కొలువై ఉన్న కొండకు " శ్వేతగిరి " అని పేరు. తెల్లటిరాళ్ళు ఉన్నటువంటి కొండ కనుక దీనికి "శ్వేతగిరి " అనే పేరు ఏర్పడిందని చెప్తారు. కొండకే " బోలికొండ " అని పేరు. కొండ పైన తెల్లటి పొడలు వచ్చినట్లుగా (బొల్లి) ఉండడం మూలంగా కొండకు " బోలికొండ " అనే పేరు ఏర్పడిందని కూడా ప్రచారంలో ఉంది. బోలికొండ మీద కొలువైవున్న రంగనాథస్వామి కనుక " బోలికొండ రంగనాథస్వామి " అనే పేరు స్వామికి వచ్చినట్లు కథనం. దీన్ని పల్లికొండ అని కూడా పిలుస్తారు.


మహర్షుల కోరిక మేర వెలసిన స్వామి 
శ్రీ మహావిష్ణువు ఒక సారి భూలోక విహారం చేస్తూ ప్రాంతానికి చేరుకున్నాడట, ప్రాంతంలోని అరణ్యంలో సంచరించి, ప్రకృతి రమణీయ దృశ్యాలను చూస్తూ కొండపైన ఒక చోట విశ్రమించారు. అయితే ప్రాంతంలోని అడవులలో, అప్పటికే ఋషులు ఆశ్రమాలను ఏర్పాటు చేసుకుని తపస్సు చేసుకుంటూ ఉండేవారు. శ్రీ మహావిష్ణువు విశ్రమించిన విషయాన్ని గమనించిన మహర్షులందరూ స్వామిని సమీపించి నమస్కరించి భక్తితో స్వామి వారిని కొలిచారు. మహర్షుల భక్తిని, దీక్షను మెచ్చుకున్న శ్రీ మహావిష్ణువు ఏదైనా వరం కోరుకోమన్నారు

అప్పుడు మహర్షులందరూ స్వామిని విదముగా వేడుకొనిరి " స్వామి ప్రకృతి రమణీయమైన కొండపైన మీరు కొలువుదీరి ఉంటె సదా మిమ్మల్ని ధ్యానిస్తూ, సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించండి. భూలోకంలో ప్రజలు జనన మరణ సంసార చక్రంలో ఇరుక్కుని అనేక బాధలు పడుతున్నారు కావున తమరు జనులకు దగ్గరగా వెలసి, వారి సదాక బాధకాలు విని వారికి మోక్షాన్ని ప్రసాదించాల్లన్నదే మా కోరిక

మహర్షుల కోరికను అంగీకరించిన శ్రీ మహావిష్ణువు బోలికొండపైన శ్రీ రంగనాథ స్వామిగా కొలువుదీరినట్లు స్థలపురాణం చెబుతుంది

కొండపైనగల ఆలయంలో వెలసిన శ్రీ రంగనాథ స్వామి వారి రూపం స్పష్టంగా కనిపించదు. శ్రీ రంగనాథుడు పుట్టుశిలగా వెలసినట్లు చెప్తారు. స్వామి వారిని బోలికొండ రంగనాథస్వామి అని రంగనాయకులు అని పిలుస్తుంటారు. స్వామి వారి భక్తులు తమ సంతానానికి రంగ, రంగనాయకులు, రంగనాథ్, రంగస్వామి, బోలికొండ, రంగమ్మ అని నామకరణం చేస్తుంటారు